మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Aug 16, 2020 , 02:43:22

చంద్రుడిపై బిలానికి సారాభాయి పేరు

చంద్రుడిపై బిలానికి సారాభాయి పేరు

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన చంద్రయాన్‌ 2 ప్రాజెక్టులో ఆర్బిటార్‌ చందమామపై ఓ భారీ బిలాన్ని(క్రేటర్‌) గుర్తించింది. దీనికి శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయి పేరు పెట్టారు. ఆయన జన్మించి ఆగస్టు 12 నాటికి 100 ఏండ్లు గడచిన గౌరవ సూచకంగా బిలానికి ఆయన పేరు మీదుగా నామకరణం చేశారు. అమెరికా అంతరిక్ష నౌక అపోలో 17 దిగిన ప్రదేశానికి తూర్పున 250-300 కిలోమీటర్ల దూరంలో సారాభాయి బిలం ఉన్నది. దీనిలోతు 1.7 కిలోమీటర్లు. వెడల్పు 8 కిలోమీటర్లు. చంద్రయాన్‌ 2 ప్రయోగంలో ల్యాండర్‌ విక్రమ్‌ క్రాష్‌ అయినప్పటికీ ఆర్బిటార్‌ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ సమాచారం అందజేస్తున్నది. logo