శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 15, 2020 , 00:16:29

ఎవరు-ఏ నినాదం?

ఎవరు-ఏ నినాదం?

 భారత స్వాతంత్య్రం కోసం ఎంతోమంది  జీవితాలను ధార పోశారు. ఆ మహాసంగ్రామంలో నినాదాలే జనాలను కదిలించాయి. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా వినిపించిన పలువురి నినాదాలు ఇక్కడ ఇస్తున్నాం. అవి ఎవరు అన్నారో గుర్తుపట్టండి.

1. బ్రిటిషర్ల  పింఛను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకడం కన్నా... సైనికుడిగా మరణించడమే మేలు.

2. కులం పునాదులపైన  ఒక జాతిని గాని, ఒక నీతిని గానీ నిర్మించలేం.

3. నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను.

4.  ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ ( విప్లవం వర్ధిల్లాలి).

జవాబులు:1. టిప్పు సుల్తాన్‌ 2. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 3.  సుభాష్‌ చంద్రబోస్‌ 4. భగత్‌సింగ్‌