గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Aug 15, 2020 , 01:27:49

వార్తల్లో మహిళ ప్రీతి జింటా

వార్తల్లో మహిళ ప్రీతి జింటా

సినీ నటిగా.. ఐపీఎల్‌  ప్రాంఛైజీ యజమానిగా సత్తా చాటిన సొట్టబుగ్గల ప్రీతి జింటా, అప్పుడప్పుడూ కొన్ని వైరల్‌ వీడియోలతో వార్తల్లోకి  వస్తుంటుంది. ఇంతకుముందు అమెరికాలో కూరగాయలు పండిస్తూ.. లాక్‌డౌన్‌  వేళ భర్తకు గడ్డం గీస్తూ కనిపించిన ప్రీతి, ఇప్పుడు గన్‌ఫైర్‌ చేస్తూ ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. అయితే.. ఈ వీడియోతోపాటు ‘హిందీ చిత్రాల్లో మహిళలు యాక్షన్‌ సన్నివేశాలు చేయలేరని ఇక ఎవరూ చెప్పరనుకుంటా.. బాలీవుడ్‌ దర్శకులు ఈ వీడియోను తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ పెట్టిన వ్యాఖ్యలు సినీ ప్రముఖులకు ఆకర్షిస్తున్నాయి. ‘కేవలం మ్యాజిక్‌తోనే మన కల నెరవేరదు. అందుకోసం కచ్చితమైన నిర్ణయాలు, కఠిన శ్రమ అవసరమవుతాయి. అందుకే.. నా యాక్షన్‌ కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రీతి జింటా ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ ట్రైనర్‌ ఆరోన్‌ కొహెన్‌ దగ్గర శిక్షణ పొందుతున్నది.