మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 12, 2020 , 23:10:46

అబద్ధం తెచ్చిన అనర్థం

 అబద్ధం తెచ్చిన అనర్థం

జగన్నాథం, శారదాదేవి దంపతుల  కొడుకు వాసు.  అతను కొంటెపిల్లాడు. అల్లరి చిల్లర పనులు చేస్తూ స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.  తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి డుమ్మా కొట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా  ఒక రాయికి గుద్దుకొని  కిందపడ్డాడు.  గాయాలయ్యాయి. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ తిరిగి ఇచ్చాడు.  ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని ‘బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్‌ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో’ అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ‘ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా   కుంటుతున్నావు? అని’ అడిగింది ఆదుర్దాగా  తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు.  ‘చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో’ అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి కిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని  మళ్లీ అబద్ధం చెప్పాడు వాసు. ‘నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది’ అని డాక్టరు చెప్పేసరికి అసలు విషయం చెప్పాడు వాసు. ‘చూశారా మీ వాడు మీతో అబద్ధం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్‌ అయి కాలు తీసేయాల్సి వచ్చేది’  అంటూ  ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ‘ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది’ అనుకున్నాడు వాసు మనసులో ఆరోజు నుంచి వాసు


logo