బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Aug 12, 2020 , 22:41:58

క్యారెట్‌ ముక్కల పచ్చడి

క్యారెట్‌ ముక్కల పచ్చడి

కావలసిన పదార్థాలు :

  • క్యారెట్‌లు : 3
  • పచ్చి మిరపకాయలు : 3
  • కొత్తిమీర : 
  • ఒక చిన్నకట్ట
  • నిమ్మకాయలు : 2
  • ఉప్పు :  తగినంత

తయారు చేసే విధానం :

క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నిమ్మకాయలు పిండుకొని ఒక గిన్నెలో రసం తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో క్యారెట్‌ ముక్కలు వేసి.. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. తర్వాత తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి. ఓ గంట పోయాక.. నిమ్మరసం, పచ్చి కారం, ఉప్పు బాగాపట్టి రుచికరమైన క్యారెట్‌ ముక్కల పచ్చడి సిద్ధమైపోతుంది.
క్యారెట్‌లో విటమిన్‌ ఎ, నిమ్మరసంలో విటమిన్‌ సి, కొత్తిమీరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ సి మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి రోగనిరోధకశక్తిని అందిస్తాయి.


logo