ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 23:26:46

పృథ్వికారాణి

పృథ్వికారాణి

మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై అంటే తమిళనాడులో అందరికీ ప్రత్యేకమైన అభిమానం. ఆ అందరూ ఇప్పుడు ఆయన మనుమరాలిని మెచ్చుకుంటున్నారు. తాత వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి రాలేదామె. కష్టపడి చదివి యూపీఎస్‌సీ పరీక్షల్లో 171 ర్యాంకు సాధించింది. 23 ఏండ్ల పృథ్వికారాణి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. చదువుల్లోనే కాదు.. ఆటల్లోనూ మహారాణే! టెన్నిస్‌లో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. కోరుకుంటే రాజకీయాల్లోకి రావొచ్చు. తాతయ్య చిత్తరువు పెట్టుకొని.. ప్రత్యర్థులను చిత్తు చేయొచ్చు. కానీ, చదువుకే ప్రాధాన్యమిచ్చింది పృథ్వికారాణి. 2018 నుంచి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. తాజాగా 171వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్‌ను ఎంచుకుంది. నిరుపేదలకు సాయం చేయడమే తన లక్ష్యమని  చెబుతోందీ వారసురాలు.logo