ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 00:06:08

ఈ మాస్క్‌ చాలా కాస్ట్‌లీ గురూ!

ఈ మాస్క్‌ చాలా కాస్ట్‌లీ గురూ!

ఫ్యాషన్‌కు తగ్గట్టుగా మాస్కులు కొత్త రూపు సంతరించుకుంటు న్నాయి. అయితే, అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపారవేత్త ఏకంగా వజ్రకచిత మాస్క్‌కు ఆర్డరిచ్చాడు. మాస్క్‌ తయారీ కోసం ఇజ్రాయిల్‌లోని జెరూసలేంలో ఉన్న వైవెల్‌ ఆభరణాల సంస్థను సంప్రదించాడు. బంగారంతో తయారుచేసే మాస్క్‌కు వజ్రాలు పొదగాలన్నాడట. ఆ వ్యాపారి కోరికకు ఏ మాత్రం తగ్గని విధంగా మాస్క్‌ రూపొందిస్తోందీ జ్యువెలరీ సంస్థ. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసే మాస్క్‌లో 3,600 నలుపు, తెలుపు వజ్రాలను పొదుగుతున్నామని చెబుతున్నారు మాస్క్‌ డిజైనర్‌ ఐజాక్‌ లేవీ. మాస్క్‌ ఖరీదు అచ్చంగా 11.2 కోట్లు. అయితే ఈ ఖరీదైన మాస్క్‌ పూర్తికావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని చెబుతోందీ తయారీ సంస్థ.


logo