శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 10, 2020 , 00:09:31

పిల్లలతోపాటు బట్టలూ పెరుగుతాయి!

పిల్లలతోపాటు బట్టలూ పెరుగుతాయి!

పిల్లల్ని రంగురంగుల దుస్తుల్లో చూడాలన్న ఆరాటం కొద్దీ తల్లిదండ్రులు ఖరీదైన కొత్త బట్టలు కొంటూనే ఉంటారు. ఏడాది నుంచి రెండేండ్ల వయసులో ఈ ముచ్చట మరీ ఎక్కువ. ఆ దశలో పిల్లల్లో ఎదుగుదల ఎక్కువ. దీంతో ఒకటిరెండు ఉతుకులకే పనికిరాకుండా పోతాయి. బిగుతుగా అనిపిస్తాయి. దీంతో డబ్బు, దుస్తులు రెండూ వృథానే. ఇలాంటి ఇబ్బందులను తీర్చేలా కొత్తగా ఆలోచిస్తున్నారు ఫ్యాషనిస్టులు. ఒకసారి కొనుగోలు చేసిన దుస్తులు రెండుమూడు సంవత్సరాలపాటు పిల్లలతో పాటే పెరిగేలా తయారు చేస్తున్నారు. అందుకు ప్రత్యేకమైన బటన్లను ఏర్పాటు చేస్తున్నారు. బటన్‌లు పెట్టి అవి పెరిగేలా చేస్తున్నారు. అలాగే నడుము స్థానంలో, మెడల వద్ద బటన్స్‌తో అదనంగా వస్ర్తాన్ని పెడుతూ.. సంవత్సరాలపాటు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే, చిన్నారుల అభిమాన బ్రాండ్‌ వెరోనా ఈ ప్రయోగం చేసింది.  మిగతావాళ్లూ ఆ దారినే అనుసరిస్తున్నారు.  logo