బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 00:43:37

ఇల్లు కాలిపోయినా.. ప్రేమ మిగిలింది!

ఇల్లు కాలిపోయినా.. ప్రేమ మిగిలింది!

ప్రేమించిన అమ్మాయికి ఆ విషయాన్ని తెలియజేయడంలో ఉన్న కష్టం ప్రేమలో మునిగినవాళ్లకే తెలుసు. అమ్మాయి తన ప్రేమను కాదనకుండా, రొమాంటింక్‌గా ఎలా ప్రపోజ్‌ చేయాలా అని యువకుడు పడే తపన అంతా ఇంతా కాదు. అమ్మాయి ఓకే అంటే ఓ ప్రపంచాన్నే గెలిచినంత సంబురం. ఇంగ్లండ్‌లోని సౌత్‌ యార్క్‌షైర్‌కు చెందిన ఆల్బర్ట్‌ ఆండ్రూ అనే యువకుడు కూడా తన ప్రేమను అందంగా, అద్భుతంగా తన స్నేహితురాలు వలేరిజా మెడివిక్‌కు చెప్పాలనుకున్నాడు. రెండు వారాలు ఆలోచించాడు. తనలోని ప్రేమ గదినిండా కనిపించేలా అందంగా అలంకరించాడు. గోడలకు బెలూన్లు అతికించాడు. నేలపై పూవులను పర్చి ప్రేమ విషయాన్ని రాశాడు. గదంతా వందలాది క్యాండిళ్లు వెలిగించాడు. షాంపేన్‌ వైన్‌ బాటిళ్లను తెచ్చి పెట్టాడు. దాదాపు 4 గంటల పాటు కష్టపడి గదిని డెకోరేట్‌ చేశాడు. ప్రేయసిని సర్‌ప్రైజ్‌ చేయాలని గదికి తాళం వేసి.. వలేరిజాను తీసుకురావడానికి వెళ్లాడు. వచ్చేసరికి క్యాండిల్‌ మంటలు  కర్టెన్‌కు అంటుకొని ఇల్లంతా కాలిపోయింది.  ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. అయినా ఆల్బర్ట్‌ బాధపడలేదు. అదే కాలిపోయిన గదిలో మోకాళ్లపై నిలబడి వలేరిజాకు ప్రపోజ్‌ చేశాడు. ఆశ్చర్యకరంగా ఆమె ఓకే చెప్పింది. ఇల్లు కాలిపోయినా ప్రేమ నిలబడింది. అదృష్టవశాత్తూ అపార్ట్‌మెంట్‌లో ఎవరికీ గాయాలు కాలేదు. 


logo