శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 00:43:38

ఐదు గంటలు వరద నీటిలో..

ఐదు గంటలు వరద నీటిలో..

  • మ్యాన్‌హోల్‌ నుంచి రక్షణగా నిలిచిన అవ్వ

ముంబై మహానగరంలో కుండపోత వర్షం. రోడ్లన్నీ నీట మునిగాయి. అయినా వాహనాదారులు ఆగడం లేదు. ఎవరి పనికోసం వారు వానలో తడుస్తూనే ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు. అది చూసిన ఓ మహిళ రోడ్డు మీదకు వచ్చింది. కర్ర పట్టుకొని నడుచుకుంటూ రోడ్డు మధ్యకు వెళ్లి అక్కడే నిలబడింది. వాహనదారులు ఇది పట్టించుకోవడం లేదు. ఆమెను తప్పించుకుంటూ, తిట్టుకుంటూ పోతున్నారు. కానీ ఆమెకు ఒక్కదానికే తెలుసు అక్కడ ఒక మ్యాన్‌ హోల్‌ తెరిచి ఉందని. అందుకే అక్కడ నిలబడింది. వాహనాలు, నడిచేవారు అందులో పడిపోకుండా హెచ్చరిస్తున్నది. అలా ఆమె వానలో తడుస్తూనే 5 గంటలకు పైగా నిల్చున్నది. ఈ విషయం కొద్ది సేపటి తర్వాత మిగతా వారికి కూడా అర్థమైంది. దీంతో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆమెపై అభినందనలు వెల్లువెత్తాయి. పట్టణాల్లో వర్షకాలంలో మ్యాన్‌హోల్స్‌లో పడి ఎంతో మంది చనిపోతుంటారు. ఒక్క ముంబైలోని గడిచిన ఐదేండ్లలో మ్యాన్‌ హోల్స్‌లో పడి 328 మంది చనిపోయారు. logo