బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 00:43:38

కొడుకును జైలు నుంచి తప్పించడానికి 35 అడుగుల సొరంగం

కొడుకును జైలు నుంచి తప్పించడానికి 35 అడుగుల  సొరంగం

ఓ సినిమాలో  నటుడు బ్రహ్మానందం సత్తు రేకుతో జైలు గోడలకు కన్నం పెట్టి, సొరంగం తవ్వి బయటకు పోవడానికి ప్రయత్నిస్తాడు... అది జోక్‌. కానీ ఉక్రెయిన్‌లో ఓ తల్లి తన కుమారుడిని జైలు నుంచి తప్పించడానికి సొరంగాన్ని నిజంగానే తవ్వింది. అది కూడా ఎవరి సహాయం లేకుండానే. సదరు కుమారుడు ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ రోజు ఆ తల్లి అతన్ని చూడటానికి వెళ్లింది. అక్కడ తనను ఎలా తప్పించాలో ఆ కుమారుడు ప్లాన్‌ చెప్పాడు. ప్లాన్‌ ప్రకారం ఆమె జైలు సమీపంలోనే గదిని అద్దెకు తీసుకున్నది. రోజూ రాత్రి కొంచెం కొంచెం కొంచెం సొరంగం తవ్వడం ప్రారంభించింది. అలా మూడు వారాల పాటు 35 అడుగుల పొడవు సొరంగాన్ని తవ్వింది. దాదాపు జైలు గోడల దాకా వెళ్లింది. అయితే ఓరోజు పోలీసులు జైలు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా సొరంగం విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంత కష్టపడ్డ ఆ తల్లి వయస్సు 51 ఏండ్లు.logo