శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 00:43:40

ఆనందం రెట్టింపు సెక్స్‌ టాయ్స్‌తో

ఆనందం రెట్టింపు సెక్స్‌ టాయ్స్‌తో

  • శృంగారాన్ని ఆస్వాదిస్తున్న జంటలు
  • ఒంటరి వాళ్లతో పోల్చితే వారిలోనే 
  • ఎక్కువ సంతృప్తి

సెక్స్‌ టాయ్స్‌ కోసం పురుషులు రాత్రి 9-12 గంటల సమయంలో ఎక్కువగా ఆర్డర్‌ చేస్తుండగా, మగువలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో కొంటున్నారు.

సెక్స్‌ టాయ్స్‌ను అధికంగా కొంటున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా కర్ణాటక రెండో స్థానంలో ఉన్నది. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది.  నగరాల పరంగా చూస్తే ముంబై మొదటి స్థానంలో ఉన్నది. తర్వాతి స్థానం బెంగళూరుది. హైదరాబాద్‌ ఆరో స్థానంలో ఉన్నది.

దట్స్‌ పర్సనల్‌ డాట్‌ కామ్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడి

కరోనా కాలంలో ఇంట్లో ఉంటేనే భద్రం. మరి ఊరికే ఇంట్లో ఉండి ఏం చేయడం.. ఇన్ని రోజులుగా విపరీతమైన పని ఒత్తిడి కారణంగా శృంగారంపై ఆసక్తి చూపనివారు ఇప్పుడు కొత్త పోకడలు పోతున్నారు. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. మరింత ఆనందమయం చేసుకోవడం కోసం పళ్లైన జంటలు సెక్స్‌ టాయ్స్‌ కొంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత దేశ  వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ అమ్మకాలు 65 %  పెరిగాయి. తెలుగు రాష్ర్టాల్లో కూడా వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు దట్స్‌ పర్సనల్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఇటీవల ఈ సంస్థ ‘ఇండియా అన్‌కవర్డ్‌: ఇన్‌సైట్‌ఫుల్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ సెక్స్‌ ప్రొడక్ట్స్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఇండియా’ పేరిట ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇటీవల మగవారితో పోల్చితే ఆడవాళ్లే ఎక్కువగా సెక్స్‌ టాయ్స్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నారు. దేశంలోని తొమ్మిది చిన్న నగరాల్లో మహిళల ఆర్డర్లు 300 శాతం పెరిగాయి. ఈ నగరాల జాబితాలో విజయవాడ మొదటిస్థానంలో ఉన్నది. వయస్సు పరంగా చూస్తే 25-34 ఏండ్ల మధ్య వయస్సువారిలో దాదాపు 61 శాతం మంది ఈ ఉత్పత్తుల కోసం మళ్లీ మళ్లీ ఆర్డర్లు చేస్తున్నారు. 

పళ్లైన వారే ఎక్కువగా.. 

సాధారణంగా సెక్స్‌ టాయ్స్‌ అంటే పెళ్లి కాని వారు కొంటారని అనుకుంటారు. కానీ తాజా అధ్యయనాన్ని బట్టి పెళ్లికాని వారి కంటే పళ్లైన వారే వీటితో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్టు చెప్పారు. పెళ్లి అయిన పురుషుల్లో సెక్స్‌ టాయ్స్‌ వాడాక  ఆనందం పొందామని  86 శాతం మంది చెప్పగా, 89 శాతం మంది మహిళలు ఇదే సమాధానమిచ్చారు. అయితే పెళ్లికాని వారిలో ఈ సంఖ్య 71 శాతంగానే ఉన్నది. సెక్స్‌ టాయ్స్‌ కొన్నాక తాము అంతకు మందు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటున్నామని చాలా మంది చెప్పారు.