శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 01:50:18

జ్యోతిక

జ్యోతిక

కరోనా వేళ సినీనటి జ్యోతిక తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ మధ్య ఆమె తమిళనాడులోని తంజావూర్‌లోని రాజా మిరాస్‌దార్‌ దవాఖాన అభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. అదీ యాదృచ్ఛికంగానే! సినిమా షూటింగ్‌ కోసం జ్యోతిక ఓసారి ఏదో దవాఖానకు వెళ్లారు. చుట్టూ ముండ్ల పొదలూ, అపరిశుభ్రమైన వాతావరణం. పాములు తిరుగుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ఆమె గుండె ద్రవీభవించింది. ‘దేవుడు నిరుపేదల్లో, రోగుల్లో ఉన్నాడు. ఆసుపత్రులకు విరాళం ఇవ్వడం అంటే దేవుడి హుండీలో డబ్బు వేయడం లాంటిదే’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జ్యోతిక చేసిన మంచి పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. 


logo