ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 01:50:05

‘జియో’ ట్రాన్సిలేటర్‌!

‘జియో’ ట్రాన్సిలేటర్‌!

దేశవ్యాప్తంగా జియో ఫోన్‌ వాడుతున్న కోట్లాది మందికి తాజాగా అందుబాటులోకి వచ్చింది.. ‘గూగుల్‌ ట్రాన్సిలేట్‌'. జియో ఫోన్‌లో ఆండ్రాయిడ్‌కి బదులు ‘Kai OS’ ఉపయోగించడంతో సాఫ్ట్‌వేర్‌ పరంగా చాలా తక్కువ సదుపాయాలు లభిస్తుంటాయి. ఇటీవల గూగుల్‌ సంస్థ రిలయన్స్‌ జియోతో జట్టుకట్టిన తర్వాత, గూగుల్‌ ట్రాన్సిలేట్‌ సదుపాయం కస్టమర్లకు చేరువైంది. మీరు, జియో ఫోన్‌ యూజర్లయితే ఈ కొత్త గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సదుపాయాన్ని వాడుకోవడం చాలా సులభం.  చేయాల్సిందల్లా.. మీ ఫోన్లోని  కెమెరాతో తర్జుమా చేయాల్సిన సమాచారాన్ని ఫొటో తీస్తే సరిపోతుంది. అందులో అంతర్గతంగా ఉండే ‘గూగుల్‌ అసిస్టెంట్‌' మక్కికిమక్కి అనువదించేస్తుంది. మీ జియో ఫోన్‌ మధ్యలో ఉండే బటన్‌ను ప్రెస్‌ చేస్తే గూగుల్‌ అసిస్టెంట్‌ ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత, పరభాషలో ఉన్న ఏదైనా ప్రాడక్ట్‌ లేబుల్‌ను కానీ, వేరే రాష్ర్టాలకు వెళ్లినప్పుడు షాపుల బోర్డు మీద రాసిన టెక్ట్స్‌ని కానీ.. క్లిక్‌ అనిపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఏ భాషలోకి తర్జుమా కావాలన్నది ఎంచుకుంటే చాలు. వెంటనే  సమాచారం అందులో కనిపిస్తుంది.


logo