మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 01:12:55

కాళ్లకు రంగులొస్తాయ్‌!

కాళ్లకు రంగులొస్తాయ్‌!

క్యాన్వాస్‌పై ఆలోచనల రంగులు వెదజల్లడం క్రియేటివిటీ. దానికి కొత్త ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం యునీక్‌నెస్‌. ఈ విషయంలో యువత ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు, కుర్రకారు చేయి పడటంతో.. స్నీకర్స్‌ కూడా కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి.  సాధారణంగానే ‘స్నీకర్స్‌' స్టయిలిష్‌గా కనిపిస్తాయి. వాటిని క్యాన్వాస్‌లా మలిచి రంగులద్దుతున్నారు యువతీయువకులు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా.. స్నీకర్స్‌ కస్టమైజేషన్‌ నయాట్రెండ్‌.

షూస్‌ యువర్‌ డాడీ...

‘షూస్‌ యువర్‌ డాడీ’కి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సుగంధ త్యాగీ దీని సృష్టికర్త. తన సృజనాత్మకతను ప్రదర్శించుకోవడానికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. క్యాన్వాస్‌ మీద ఎక్కువ పని చేస్తుంది. మొదట, నైకె ఎయిర్‌ఫోర్స్‌ షూస్‌ను రెయిన్‌బో పాదరక్షల్లా మార్చేసింది. తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.

(shoesyourdaddy)

నిషాంత్‌ ఫొగాట్‌

నిషాంత్‌కు కస్టమైజేషన్‌ అంటే ఆసక్తి. నిఫ్ట్‌ నుంచి డిగ్రీ చేసిన తర్వాత అతను ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌కే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నాడు. రకరకాల వస్తువులతో డిజైన్లను సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా పాత షూస్‌ సేకరించి, వాటిపై బొమ్మలు వేసి, రీయూజెబుల్‌గా చేయడం తన అలవాటు. ప్రస్తుతం ‘ప్యూమా’ బ్రాండ్‌కి క్రియేటివ్‌ కన్సల్టెంట్‌.

(@fogaat)

నాజ్‌ది షిల్లాంగ్‌. ఒకరోజు అతను సూట్‌కు తగ్గట్టు షూ ధరించాలని అనుకున్నాడు. తన దగ్గర జోర్డన్‌ షూస్‌ జత ఉంది. కానీ అవి సూట్‌కు తగ్గట్టుగా అనిపించలేదు. దీంతో వాటిపై పెయింటింగ్‌ వేశాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది ‘నాజ్‌ షూస్‌ కస్టమైజేషన్‌'. కనిపించిన ప్రతి షూనూ కస్టమైజ్‌ చేయడం ప్రారంభించాడు. కార్టూన్‌ క్యారెక్టర్లు, సూపర్‌ హీరోస్‌.. ఇలా రకరకాల పెయింటింగ్స్‌ను పాదరక్షలకు ఎక్కిస్తాడు.

(naz_shoes_customiser)


చైతన్య దీక్షిత్‌ (చే).. స్నీకర్స్‌ కస్టమైజింగ్‌లో దిట్ట. చాలామంది స్టార్‌ క్లయింట్స్‌ ఉన్నారు. రణబీర్‌ కపూర్‌, కన్వీర్‌సింగ్‌, ఆనంద్‌ అహూజా, విజ్‌ ఖలీఫా వంటివారు ‘చే’ కస్టమైజింగ్‌ స్నీకర్స్‌ను వాడుతున్నారు. ఎప్పటికైనా తన సొంత స్నీకర్స్‌ కంపెనీని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. 

(chiatanya_dixit)


logo