ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 01:12:57

కొవిడ్‌ సంక్షోభమే..‘పెట్‌'బడిగా!

కొవిడ్‌ సంక్షోభమే..‘పెట్‌'బడిగా!

మీరు కరోనా ‘పాజిటివ్‌' అయితే, మీ ఇంట్లో వాళ్లంతా ఐసొలేషన్‌లో ఉంటే? మీ కుటుంబ సభ్యుల వరకూ ఫర్వాలేదు. మీ పెంపుడు జంతువు యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? మీలాంటివారి కోసమే ప్రారంభమైంది ‘స్కూబీ పెట్‌'! కరోనా సంక్షోభ సమయాన్ని ఓ వ్యాపార అవకాశంగా మార్చుకున్నాడు పన్నీరు తేజ. ఈ యువకుడు హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉంటాడు. డిగ్రీ వరకూ చదివాడు. జంతు ప్రేమికుడు. పెట్స్‌కు సేవలు చేయడమే తనకు ప్రధాన ఉపాధి. కొంత పారితోషికం తీసుకుని.. తనే కస్టమర్ల ఇంటికి వెళ్తాడు. రోజూ వాటికి స్నానం చేయిస్తాడు, ఫుడ్‌ పెడతాడు, వాకింగ్‌కు తీసుకెళ్తాడు. సిటీలో పెట్స్‌ కల్చర్‌ ఎక్కువే. ఆ మూగజీవాలు దాదాపుగా కుటుంబసభ్యుల హోదాను పొందుతున్నాయి. 

కరోనా క్వారంటైన్‌లూ, ఐసొలేషన్‌లూ ఆ మూగజీవాల మనుగడను సంక్షోభంలో పడేశాయి. యజమానులు కూడా వాటిని తలుచుకుని కుమిలిపోతున్నారు. ఈ ఇబ్బందులు తీర్చేందుకు తేజ స్కూబీ పెట్‌ సర్వీస్‌ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఒక్క కాల్‌ చాలు. ఇంటికి వచ్చి పెట్స్‌ను తీసుకొని వెళ్తాడు. యజమానులు పూర్తిగా కొలుకునే వరకూ తన వద్దే పెట్టుకుంటాడు. ప్రేమగా చూసుకుంటాడు. వాటి ఆహార ఖర్చులతో పాటు సర్వీస్‌ చార్జ్‌గా కొంత తీసుకుంటాడు. ‘ఇది పూర్తిగా వ్యాపారం కాదు. ఇందులో సామాజిక బాధ్యత కూడా ఉంది’ అంటాడు తేజ.logo