గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 00:35:38

మాల్స్‌కు వెళ్తున్నారా?

మాల్స్‌కు వెళ్తున్నారా?

కొవిడ్‌-19 అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతున్నది.  ఇప్పుడిప్పుడే షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు వివిధ నిబంధనలను అమలుచేస్తున్నారు. అదే సమయంలో, మనమూ తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కొన్ని ముఖ్య సూచనలు.

మాల్స్‌ ప్రవేశద్వారం వద్ద ఉన్న యూవీ స్కానర్‌ను విధిగా ఉపయోగించుకోవాలి. బ్యాగులతోపాటు చెప్పులు, షూస్‌ కూడా శానిటైజ్‌ చేసుకొని మాల్‌లో అడుగుపెట్టాలి.

ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీనివల్ల, పరిసరాల్లోని కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల కదలికలు తెలుస్తాయి. సురక్షితం అనిపిస్తేనే, షాపింగ్‌ చేసుకోవచ్చు. 

భౌతిక దూరం తప్పక పాటించాలి. ఎస్కలేటర్‌, క్యాష్‌ కౌంటర్‌ వద్ద, ఇతరులకు ఆరు అడుగుల దూరంలో నిలబడాలి. 

స్టోర్‌ సిబ్బంది సూచనల్ని పాటించాలి.

శానిటైజ్‌ చేసిన దుస్తులను మాత్రమే ట్రయల్‌ చేయాలి. ట్రయల్‌ తర్వాత కూడా శానిటైజ్‌ చేస్తున్నారా లేదా అన్నది గమనించాలి.

బిల్లులు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. 

 మాల్స్‌లో సిబ్బంది మాస్కులు, గ్లోవ్స్‌, డస్ట్‌బిన్‌లను వాడుతున్నారా లేదా అన్నది గమనించాలి. మీరు కూడా వాటిని వాడితే మంచిది. 

ఫుడ్‌ కోర్టుకు వెళ్లేవారు, అవి శుభ్రంగా ఉన్నాయో లేదో గమనించాలి. అయినా సరే, మీ వద్ద ఒక పోర్టబుల్‌ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ స్ప్రే ఉంచుకోవడం మంచిది. 

షాపింగ్‌ అనంతరం బయటికి వచ్చే సమయంలో, మీ బ్యాగులను శానిటైజ్‌ చేయించాలి.


logo