సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 00:35:37

ఇమ్యూనిటీ ఫుడ్‌.. సజ్జ సేమ్యా

ఇమ్యూనిటీ ఫుడ్‌.. సజ్జ సేమ్యా

కావలసిన పదార్థాలు:

సజ్జ పిండి -150 గ్రా., మైదా - 50 గ్రా.,

ఉప్పు - చిటికెడు, నీళ్లు -125 మి.లీ.

తయారు చేసే విధానం:

గిన్నెలో 125 మి.లీ. నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్లలో సజ్జ పిండి, మైదా, ఉప్పు కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ పిండి ముద్దను వర్మిసెల్లి గొట్టంలో పెట్టుకొని, ప్లాస్టిక్‌ కవర్‌ మీద వత్తుకోవాలి. వీటిని 2-3 రోజులు ఆరనివ్వాలి. తరువాత వాటిని, సేమ్యా వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 11.6 గ్రా., కొవ్వు - 5.60 గ్రా., పీచు పదార్థం - 1.2 గ్రా., పిండి పదార్థం -67.5 గ్రా., శక్తి - 361.0 కి.క్యాలరీస్‌, క్యాల్షియం - 42.0 మి.గ్రా., ఇనుము - 8 మి.గ్రా.


logo