శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 23:15:02

అమ్మ మెస్‌.. అదరహో!

అమ్మ మెస్‌.. అదరహో!

మీరు ఎప్పుడైనా తమిళనాడులోని మదురై వెళ్లారా? ఆ పట్టణానికి వెళ్లిన వారంతా అమ్మ మెస్‌లో భోజనం చేయాల్సిందే. ఏ కారణంతో అయినా తినకపోతే, అదో వెలితి. అంతగొప్పగా ఉంటాయి ఆ రుచులు, ఆ ఆతిథ్యమూ.  సెంథిల్వెల్‌, సుమతి దంపతులు సదరు మెస్‌ యజమానులు. 1992లో ప్రారంభమైంది ఈ మెస్‌. ఇక్కడ చేసే ప్రతీ వంటకం వెనుకా ఓ కథ ఉంటుంది. ఎముక మజ్జ, పీత, రొయ్యలు, చేపలు, చికెన్‌, మటన్‌లతో చేసే ఆమ్లెట్లు స్పెషల్‌. రొయ్యలు, పీత, కోడి, మటన్‌తో దోసెలు వేస్తారు. ఇంతకీ, ఇప్పుడు అమ్మ మెస్‌ ప్రస్తావన ఎందుకని అంటారా? తాజాగా, ఓ ఇంటర్వ్యూలో.. సినీ నటి నివేదా థామస్‌ ఈ మెస్‌ గురించి ప్రస్తావించింది. ఇక్కడ వండే ఆహారం అచ్చం ఇంటి భోజనంలానే ఉంటుందనీ, తనకెంతో ఇష్టమనీ పేర్కొన్నది.