ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 03:36:07

జిమ్‌కు వెళ్తున్నారా?

జిమ్‌కు వెళ్తున్నారా?

  • జిమ్‌లోని వస్తువులను తాకటానికి ముందు, వాడిన తరువాత.. వాటిపై శానిటైజర్‌ స్ప్రే చేయాలి. జిమ్‌ సిబ్బంది ఎక్విప్‌మెంట్‌ను శుభ్రపరచినా.. మన జాగ్రత్తలో మనం ఉండాలి. 
  • గాలి, వెలుతురు సమృద్ధిగా ఉండే జిమ్‌లను మాత్రమే ఎంచుకోవాలి. ఆ గది విశాలంగా ఉంటే సామాజిక దూరం పాటించడానికి వీలవుతుంది. వెంటిలేషన్‌ సమృద్ధిగా ఉంటే, వైరస్‌ ప్రమాదాలు తగ్గిపోతాయి. 
  • జిమ్‌లోని లాకర్‌ రూమ్‌లను వాడకపోవడమే మేలు. సొంత వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం ఉత్తమం. 

జిమ్‌కు వెళ్లి చెమటలు చిందిస్తే తప్ప, వ్యాయామం చేసినట్టు అనిపించదు చాలామందికి.  జిమ్‌లు మూత పడటంతో ఫిట్‌నెస్‌ తగ్గి, బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళన ఉండేది. నేటి నుంచి జిమ్‌లు  తెరుచుకొంటాయి.కానీ, వెళ్లాలా, వద్దా అన్న సందేహం?  ఆరోగ్యం కోసం వెళ్లి అనారోగ్యాన్ని కొనితెచ్చుకొంటామేమో అన్న భయం. కొవిడ్‌ బారిన పడకుండా జిమ్‌లో కసరత్తులు ఎలా చేసుకోవాలి? అనే ప్రశ్న  అందరి మనసులనూ తొలిచివేస్తున్నది. ఇంతకూ, నిపుణులేం చెప్తున్నారు?

  • జిమ్‌లలో ప్రమాదకర స్టెఫైలోకోకస్‌ ఆరియస్‌ బ్యాక్టీరియా తిష ్టవేసుకొని ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, కరోనాతోపాటు స్టెఫైలోకోకస్‌ లాంటి ఇన్‌ఫెక్షన్లు విస్తరించకుండా నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కూడా తగిన స్టెరిలైజింగ్‌ చర్యలు తీసుకుంటున్న జిమ్‌లకు మాత్రమే వెళ్లాలి. 
  • నిర్వాహకులు జిమ్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలి. కస్టమర్లను వీలైనన్ని ఎక్కువ బ్యాచ్‌లుగా విడదీయడం మంచిది. ప్రతి ఇద్దరి మధ్యా ఆరు అడుగుల దూరం క్షేమకరం. మనం కూడా రద్దీ తక్కువ ఉండే వేళలనే ఎంచుకోవాలి.  
  • వర్కవుట్‌ చేసేటప్పుడు చేతులకు గ్లోవ్స్‌ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల, చర్మం ద్వారా నేరుగా వైరస్‌ లోపలికి వెళ్లలేదు. 
  • వ్యాయామం చేసేటప్పుడు, మధ్యలో చెమట తుడుచుకోవడానికి టవల్‌ ఉపయోగించేవారు.. దాన్ని ఎక్కడ పెడుతున్నామనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్‌ఫెక్ట్‌ అయిన చోట ఉంచితే ప్రమాదం. 
  • మాస్కు తప్పనిసరిగా వాడాలి. వ్యాయామం చేసినప్పుడు చెమటతో మాస్కు తడిసిపోతుంది. కాబట్టి, డిస్పోజబుల్‌ అయితే ఉత్తమం.
  • జిమ్‌ నుంచి రాగానే నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి, శుభ్రంగా తలస్నానం చేసేయాలి. ఆ బట్టలను కూడా ఉతుక్కోవాలి.
  • వృద్ధులూ, గుండెజబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్లు కరోనా వైరస్‌ బారినపడే ప్రమాదం ఎక్కువ. కారణం.. వీళ్లకు ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే. ఈ కేటగిరీలోని వారు జిమ్‌కి వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. రోజువారీ వ్యాయామం కోసం నడక, యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌ సైజుల వంటివి మేలు. 


logo