ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 03:36:07

సజ్జ మంచూరియా

సజ్జ మంచూరియా

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 150 గ్రా., మిర్చి : 10 గ్రా., కొత్తిమీర : 5 గ్రా., పుదీన : 5 గ్రా., కార్న్‌ఫ్లోర్‌ : 15 గ్రా., ఆలుగడ్డ : 20 గ్రా., క్యారెట్‌ : 15 గ్రా., ఉల్లిపాయలు : 15 గ్రా., చిల్లీసాస్‌ : 25 మి.లీ., సోయాసాస్‌ : 25 మి.లీ., ఉప్పు : రుచికి తగినంత, నీళ్ళు : 60 మి.లీ.

తయారు చేసే విధానం : 

ముందుగా కూరగాయలను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. వీటిని సజ్జ పిండిలో కలిపి తగినంత ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌, కొత్తిమీర, పుదీనా ఆకులను జోడించి.. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి. మరొక 

కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిల్ల్లీసాస్‌, సోయాసాస్‌ వేసి కొంచెం నీళ్ళు పోసి ముందుగా తయారు చేసుకొన్న మంచూరియా బాల్స్‌ వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. వేడిగా తింటే బాగుంటాయి.

పోషక విలువలు ( 100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ : 11.7 గ్రా., కొవ్వు : 9.8 గ్రా., పీచు పదార్థం : 3.6 గ్రా., పిండి పదార్థం : 49.3 గ్రా., శక్తి : 354.7 కి.క్యాలరీస్‌,

క్యాల్షియం : 42.9 మి.గ్రా., ఇనుము : 5.3 మి.గ్రా.


logo