శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 03:36:07

‘లెక్క’లేని ఔదార్యం జెఫ్‌ బెజోస్‌...

‘లెక్క’లేని ఔదార్యం జెఫ్‌ బెజోస్‌...

అమెజాన్‌ స్థాపకుడు. ప్రపంచంలోనే ధనికుడు. తన భార్య మెకెంజీ. ఇద్దరికీ పొసగకపోవడంతో విడిపోవాలనుకున్నారు. 2019లో విడాకుల భరణం కింద మెకెంజీకి 38 బిలియన్‌ డాలర్లు దక్కాయి. కానీ, మెకెంజీ ఆ సంపదను చూసి మురిసిపోలేదు. సొమ్ము దక్కిన నెలరోజుల్లోనే ‘నా జీవితకాలంలోనే, నా ఆస్తిలో చాలా భాగాన్ని పేదలకు పంచిపెడతా’ అని ప్రతిజ్ఞ చేసింది.  మాటకు కట్టుబడి గత ఏడాది కాలంలో 1.7 బిలియన్‌ డాలర్లు దానం చేసింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, వర్ణ వివక్ష నిర్మూలన తదితర లక్ష్యాల కోసం పనిచేస్తున్న 116 స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళం అందించినట్లు వెల్లడించింది. ‘నేను ఇచ్చే డబ్బుతో సమాజంలోని అసమానతలు కొంతైనా తగ్గితే అంతకంటే ఇంకేం కావాలి’ అంటున్నది మెకెంజీ. 


logo