శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 04, 2020 , 00:31:04

సాకర్‌ ఆటగాడితో ప్రధాని సనా మారిన్ వివాహం

సాకర్‌ ఆటగాడితో ప్రధాని సనా మారిన్ వివాహం

ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మేరిన్‌ (34) తన దీర్ఘకాల సహచరుడు మార్కస్‌ రాయిక్కోనెన్‌ను వివాహం చేసుకొంది. ఈ జంట 18 ఏండ్ల వయసు నుంచీ కలిసే ఉంటున్నది. వీరికి ఒక కూతురు. అధికారిక నివాసమైన కేసరంటాలో జరిగిన ఈ వేడుకకు నలభైమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన మేరిన్‌ 2019 డిసెంబర్‌లో ఫిన్‌లాండ్‌ 46వ ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. గత ఏడాది ప్రారంభంలో రెండోసారి ఎంపీగా గెలిచి ట్రాన్స్‌పోర్టు, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా వ్యవహరించింది. ఆ తర్వాత మారిన సమీకరణల్లో.. అధికార పీఠాన్ని దక్కించుకొంది. ప్రధానిగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది. 


logo