మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 04, 2020 , 00:31:06

ఆవిరే ఆయువు..

ఆవిరే ఆయువు..

  • ముంబయి పరిశోధకుల అధ్యయనం

కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైరస్‌ బారినపడినవారిలో  కొందరు అల్లోపతి మందులు వాడుతున్నారు. ఇంకొందరు హోమియో, ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. అయితే, సంప్రదాయ చిట్కాలో ఒకటైన..  ఆవిరి పట్టడం అనేది కరోనా బారినుంచి కాపాడుతుందని ముంబయిలోని సెవెన్‌హిల్స్‌ దవాఖాన వైద్యులు నిరూపించారు. హాస్పిటల్‌కు చెందిన డా.దిలీప్‌ పవార్‌ సారథ్యంలో మూడు నెలలుగా పరిశోధన చేసి, ఆవిరి పట్టినవారు త్వరితగతిన కోలుకుంటున్నట్టు  గుర్తించారు. అల్లం, పసుపు తదితర వంటింటి ద్రవ్యాలతో ఈ ఆవిరి చికిత్స చేశారు. 

ఇందుకోసం 105 మంది కొవిడ్‌ రోగులను ఎంపిక చేసుకొని..  రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని, లక్షణాలు  బహిర్గతం కాని కరోనా బాధితులకు రోజుకు మూడుసార్లు ఆవిరి చికిత్స ఇచ్చారు. దీంతో వారు మూడు రోజుల్లోనే కోలుకొన్నారు. కరోనా  తీవ్రత ఎక్కువగా ఉన్న రెండో గ్రూపులోని బాధితులకు... ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరిపట్టారు. వారు వారంలోనే సాధారణ స్థితికి చేరుకొన్నారు. గతంలో దగ్గు, జలుబులకు చిట్కాగా పనిచేసిన ఆవిరి... ఇప్పుడు కరోనానే ఆవిరి చేయడం మంచి వార్తే!


logo