మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 02, 2020 , 23:32:54

నాడు తన చదువును అడ్డుకున్న తెగ పెద్దలే ఇప్పుడు జేజేలు పలుకుతున్నారు

నాడు తన చదువును అడ్డుకున్న తెగ పెద్దలే ఇప్పుడు జేజేలు పలుకుతున్నారు

  • యామిని

ఒడిశా, నౌపడా జిల్లా, సునబెడ గ్రామంలోని.. చకోటియా భుంజియా గిరిజన తెగకు చెందిన యువతి యామిని. ఆడపిల్లలు ఇల్లు దాటి చదువుకోవడం ఈ తెగ వారికి అస్సలు నచ్చదు. కానీ, యామినికి చదువు అంటే ఇష్టం. ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ చదువుకొని తీరుతానని శపథం పట్టింది. తెగ ఆంక్షలను పక్కనపెట్టి తల్లిదండ్రుల అండతో పాఠశాల విద్య పూర్తి చేసింది. అనంతరం కళాశాలలో చేరింది. పీహెచ్‌డీ కూడా పూర్తి చేసి చకోటియా భుంజియా తెగలో మొట్టమొదటి స్కాలర్‌గా నిలిచింది. నాడు తన చదువును అడ్డుకున్న తెగ పెద్దలే ఇప్పుడు జేజేలు పలుకుతున్నారు. యామిని స్ఫూర్తితో తెగలోని అమ్మాయిలంతా బడికి వెళ్తున్నారు.logo