ఆదివారం 09 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:50

పదో తరగతి పై 33 ఏండ్ల దండయాత్ర

పదో తరగతి పై 33 ఏండ్ల దండయాత్ర

  • కరోనా సాయంతో ఎట్టకేలకు విజయం

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు ఏ రూపంలో తడుతుందో ఎవరూ చెప్పలేరు.  ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న వైరస్‌ అతని పాలిట అదృష్ట దేవత అవుతుందని తను కూడా అనుకొని ఉండడు. కానీ ముప్పై ఏండ్లుగా అతని చేత కాని పనిని అతని తరఫున కరోనా వైరస్‌ వచ్చి పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ నూరుద్దీన్‌ వయస్సు 51 ఏండ్లు. పదో తరగతి పాస్‌ కావడం కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది కాదు.. ఏకంగా 33 ఏండ్లుగా పరీక్ష రాస్తున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫలితాలు మాత్రం షరా మామూలే. ప్రతిసారి ఫెయిల్‌. కానీ ఈసారి కరోనా కారణంగా విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేయటంతో అతను కూడా పాస్‌ అయిపోయాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నూరుద్దీన్‌ తన చదువును కొనసాగిస్తానని చెప్తున్నాడు. డిగ్రీ, పీజీ కూడా పూర్తి చేస్తానన్నాడు.


logo