శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:52

విమానమే ఇల్లు

విమానమే ఇల్లు

సృజనాత్మకంగా ఆలోచించేవారికి ఈ భూమ్మీద వృథా వస్తువంటూ ఏదీ కనిపించదు. అందరూ పనికిరాదు అనుకున్నవాటితోనే అద్భుత కళాఖండాలు సృష్టిస్తారు. అమెరికాలోని ఒకేగాన్‌ రాష్ర్టానికి చెందిన 64 ఏండ్ల బ్రూస్‌ క్యాంప్‌బెల్‌ కూడా అలాంటి వ్యక్తే. ఆయన తన పొలంలో ఓ వెరైటీ ఇల్లు నిలబెట్టేశాడు. అంత స్పెషల్‌ ఇల్లు ఏంటా అనుకుంటున్నారా.? ఫొటోలో కనిపిస్తున్న ఈ విమానమే ఆయన ఇల్లు. 1999లో గ్రీస్‌లో ఒలంపస్‌ ఎయిర్‌వేస్‌ నుంచి ఉపయోగంలో లేని బోయింగ్‌ 737 విమానాన్ని లక్ష డాలర్లకు కొన్నాడు. తన పొలంలోకి చేర్చటానికి మరో లక్షా 20వేల డాలర్లు ఖర్చు పెట్టాడు.


logo