శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:52

300 ఏండ్లనాటి గుడి బంగ్లాదేశ్‌లో పునరుద్ధరణ

300 ఏండ్లనాటి గుడి బంగ్లాదేశ్‌లో పునరుద్ధరణ

బంగ్లాదేశ్‌లో 300 ఏండ్లనాటి ఓ ఆలయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నది. నాతోర్‌ జిల్లాలో ఉన్న శ్రీశ్రీ జోయ్‌కాళీ మాత మందిరాన్ని 1.33 కోట్ల టాకాలు వెచ్చించి పునరుద్ధరిస్తున్నట్టు బంగ్లాదేశ్‌లో భారత రాయబారి తెలిపారు. గత సోమవారం ఈ ఆలయ పునరుద్ధరణ పనులను బంగ్లాదేశ్‌ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌ ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లోని పురాతన ఆలయాల్లో ఇదీ ఒకటి. దీనిని 18వ శతాబ్దంలో నాతోర్‌ రాణి భహానీ వద్ద దివాన్‌గా పనిచేసిన దయారాం రాయ్‌ నిర్మించారు. ఈ ఆలయంలో ఇప్పటికీ దుర్ఘ, కాళీపూజలు ఏటా జరుగుతాయి.  


logo