శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:52

వాషింగ్‌ మెషిన్‌లో ఉతికి..మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఆరబెట్టి!

వాషింగ్‌ మెషిన్‌లో ఉతికి..మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఆరబెట్టి!

కరోనా భయంతో ఓ వ్యక్తి వింత చర్య

తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. కూరగాయలు కొంటే ఉప్పు, వేడి నీటిలో కడగండి. ఫోన్లు, ఇతర వస్తువులను కూడా సాధ్యమైతే స్టెరిలైజ్‌ చేసుకోండి. వైరస్‌రాకుండా జాగ్రత్త పడండి అన్న ప్రభుత్వ సూచనలు విన్న దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి ఇంకో అడుగు ముందుకేశాడు. కరెన్సీ నోట్లపై కరోనా వైరస్‌ ఉండొచ్చేమోనన్న అనుమానంతో వాటిని వాషింగ్‌మెషిన్‌లో వేశాడు. డబ్బులు తడుస్తాయి అన్న ఆలోచన వచ్చిందేమో.. వెంటనే బయటకు తీశాడు. అప్పటికే కొన్ని నోట్లు పాడయ్యాయి. ఆ తర్వాత తడి నోట్లను మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టాడు. కొన్ని కాలిపోయాయి. తర్వాత ఏం చేయాలో పాలుపోక వాటిని పట్టుకుని బ్యాంకుకు పరుగు తీశాడు. దక్షిణ కొరియాలో చట్టాల ప్రకారం నోట్ల మార్పిడికి అవకాశం ఉండటంతో బ్యాంకు వాళ్లు కొత్త కరెన్సీ ఇచ్చారు. సదరు వ్యక్తి వాషింగ్‌ మెషిన్‌లో వేసిన మొత్తం  దాదాపు 14 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలకు పైగా విలువైన నోట్లు పాడైపోగా దానికి గాను కొత్త కరెన్సీ ఇచ్చారు. కరోనా కారణంగా ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మరి.  logo