శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:49

పక్షికోసం 35 రోజులు చీకట్లో గ్రామం

పక్షికోసం 35 రోజులు చీకట్లో  గ్రామం

కొద్దిరోజుల క్రితం కేరళలో పటాకులు తిని తీవ్ర గాయాలతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది. ఇటీవలే ఓ ఆవు కూడా అలాగే మరణించింది. ఈ వార్తలు జంతువులపై మనిషి క్రూరత్వాన్ని కండ్లకు కట్టాయి. కానీ తమిళనాడులోని ఓ గ్రామం చిన్న పక్షి కోసం ఏకంగా 35 రోజులు అంధకారంలో ఉండిపోయింది. శివగంగ జిల్లాలోని పోతకుడి అనే గ్రామం కారుణ్యంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామంలోని 35 వీధిలైట్లకు ఒకే ఒక్క స్విచ్చ్‌ బోర్డు డబ్బా ఉన్నది. అందులో కొద్దిరోజుల క్రితం ఇండియన్‌ మోబిల్‌గా పిలిచే చిన్న పక్షి గూడు కట్టుకొని గుడ్లు పెట్టింది. గ్రామంలో వీధిలైట్లు రోజూ ఆన్‌- ఆఫ్‌ చేయాలంటే డబ్బా తెరువాల్సిందే. అలా తెరిస్తే పక్షి బెదిరిపోతుందని భావించిన గ్రామస్తులు ఆది గుడ్లు పొదిగి పిల్లలు పుట్టి గూటిలోంచి వెళ్లపోయేవరకు డబ్బా తెరువకూడదని నిర్ణయించారు. అందుకోసం ఏ కురుప్పరాజా అనే 20 ఏండ్ల విద్యార్థి గ్రామస్తులందరికీ నచ్చజెప్పి ఒప్పించాడు. అలా 35 రోజులు వీధిలైట్లు లేకుండా గ్రామం చీకట్లోనే  ఉండిపోయింది. చివరకు పక్షి పిల్లలు పెరిగి పెద్దయ్యి ఆకాశంలోకి ఎగిరిపోయాకే గ్రామంలో వీధి లైట్లు వెలిగాయి. 


logo