గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:33

అవును, నేను జయించాను

అవును, నేను జయించాను

కొవిడ్‌-19 బారిన పడిన వారిలో మానసిక బలాన్ని నింపాలనీ, ప్రపంచం నుంచి వెలివేసినట్టు చూడకూడదనీ మాండ్య ఎంపీ, సీనియర్‌ నటి సుమలత పిలుపునిస్తున్నారు. కరోనా రోగులు కోలుకునేందుకు చేయూత అందించాలని ఆమె ఓ వీడియో ద్వారా అభిమానులను కోరారు. కరోనా బారిన పడిన సుమలత, ఈమధ్యే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ పూర్తిగా కోలుకొన్నారు. తాను కొవిడ్‌ మీద ఓ సైనికురాలిలా పోరాడాననీ, ఆ విషక్రిమిని పట్టుదలతో జయించాననీ సగర్వంగా ప్రకటించారు. మానసిక బలానికి యోగా, శారీరక బలానికి పోషక విలువలతో కూడిన ఆహారం.. ఉపయోగపడినట్టు తెలిపారు. ఆమె ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి వైద్యుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత, మరో నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం  ఉందని కూడా సూచిస్తున్నారు సుమలత.logo