గురువారం 13 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:56:37

రాఖీ.. చాలా స్వీట్‌ గురూ!

రాఖీ.. చాలా స్వీట్‌ గురూ!

రుచికరమైన రాఖీలేమిటి? అనుకుంటున్నారా. ఔను.. ఈసారి రాఖీలు అందమైనవే కాదు.. రుచికరమైనవి కూడా. ఈ తీపి వెనుక ఓ కథ ఉంది. సాధారణంగా మనవాళ్లేం చేస్తారు? కట్టిన అర్ధగంటకే తీసేసి పక్కకు పెడతారు. పాపం చెల్లె ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించరు. కానీ, రాఖీని వెంటనే తీసేయడం అంటే ఆ బంధాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నట్టే కదా? అందుకే, కొంతమంది మిఠాయి ఆవిష్కర్తలు చాక్లెట్‌ ఫ్లేవర్స్‌తో రాఖీలు తయారు చేస్తున్నారు. రోజ్‌, పాన్‌ సువాసనలూ, రుచులతోనూ వస్తున్నాయి. ఒక్కో రాఖీ బాక్స్‌ ధర  మూడొందల నుంచి ఐదొందల వరకూ పలుకుతున్నది. పుణెకు చెందిన దాదూస్‌ స్వీట్‌ హోం మేకర్‌ రషీల్‌ దాదూ.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రుహీ అగర్వాల్‌ తదితరులు ఇలాంటి స్వీట్‌ రాఖీలను తయారుచేస్తున్నారు. logo