గురువారం 13 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:56:37

మెల్లమెల్లగా..

మెల్లమెల్లగా..

పరుగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్లు తాగడం మేలంటారు పెద్దలు. డాక్టర్లు కూడా మెల్లగా తినడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణప్రక్రియ  బాగా జరుగుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందుకే, మీరు మెల్లగా తినాలనుకొంటే ఈ ఫోర్క్‌ని పట్టుకోండి చాలు. అదే నియంత్రిస్తుంది. ఎలా అంటారా? మీరు తొందరగా తింటే మాత్రం, వెంటనే ఫోర్క్‌ వైబ్రేట్‌ అవుతుంది. మెల్లమెల్లగా తినమని మెల్లగా మందలిస్తుంది. అలాగే మీరు తినే వాటిలో ఎన్ని ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయో కూడా చెబుతుంది. ఈ ఫోర్క్‌ పేరు హాపీఫోర్క్‌. ఇదే పేరుతో యాప్‌ కూడా ఉంది. దీంతో  ఫోర్క్‌ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. logo