శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:35:15

ఇమ్యూనిటీ ఫుడ్‌

ఇమ్యూనిటీ ఫుడ్‌

సజ్జ బిర్యానీ

కావలసిన పదార్థాలు :

సజ్జ రవ్వ : 100 గ్రాములు

ఉల్లిపాయలు : 15గ్రాములు

పచ్చిమిర్చి : 5 గ్రాములు

పుదీనా : 5 గ్రాములు

కొత్తిమీర : 5 గ్రాములు

నెయ్యి లేదా నూనె : 5 గ్రాములు

జీడిపప్పు (అవసరమైతే) : 4

పలావు దినుసులు :10 గ్రాములు

ఉప్పు : రుచికి సరిపడా

ఆలుగడ్డ : 1 లేదా 20 గ్రాములు

క్యారెట్‌ : 15 గ్రాములు

అల్లం : 10 గ్రాములు

వెల్లుల్లి : 5 గ్రాములు

తయారు చేసే విధానం :ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్‌, కొత్తిమీర, పుదీనాలను ముక్కలుగా తురుముకోవాలి. మందపాటి గిన్నెలో నూనె పోసి పలావు దినుసులు, అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి. వేగిన తర్వాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి, మరో 5 నిమిషాలు వేగనిచ్చి, రుచికి తగినంత ఉప్పు వేసి 4 కప్పులు నీళ్ళు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వను వేసి, సన్నని సెగపై ఉడకనివ్వాలి. తయారైన బిర్యానీని పుదీనా, కొత్తిమీరలతో అలంకరించుకోవాలి.

పోషకాలు (100 గ్రా. లో) :

శక్తి : 263.2 కి.క్యాలరీస్‌

ప్రొటీన్స్‌ : 7.6 గ్రాములు

కొవ్వు : 7.4 గ్రాములు

పీచు పదార్థం : 1.4 గ్రాములు

పిండి పదార్థం : 45.9 గ్రాములు

క్యాల్షియం : 47.4 మి.గ్రాములు

ఇనుము : 6.3 మి.గ్రాములు


logo