శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:35:17

కమలాదేవి హ్యారిస్‌

కమలాదేవి హ్యారిస్‌

క్యాలిఫోర్నియా సెనెటర్‌, న్యాయవాది కమలాదేవి హ్యారిస్‌ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన క్యాన్సర్‌ నిపుణురాలు. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా ఆఫ్రికన్‌. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న బైడెన్‌ కనుక విజయం సాధిస్తే.. కమలాదేవి వైస్‌ ప్రెసిడెంట్‌ పీఠం ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. కమల యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించారు. గతంలో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా, అటార్నీ జనరల్‌ ఆఫ్‌ క్యాలిఫోర్నియాగా  పని చేసి సమర్థురాలిగా పేరు తెచ్చుకున్నారు.


logo