శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 28, 2020 , 23:23:01

అమ్మకు దూరంగా..

అమ్మకు దూరంగా..

మార్చి చివరివారం. ఎప్పటిలానే విధులకు వెళ్తున్నాడు కరణ్‌ బన్సాలి. రోజూ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పే ఆ తల్లి.. ఆరోజు మాత్రం గుండెనిండా భయంతో సాగనంపాల్సి వచ్చింది. బ్యాగు సర్దుకొని తల్లి దగ్గరకు వచ్చాడు కరణ్‌. ‘నేను వెళ్లాల్సిందే అమ్మా! రేపు ఈ సమయానికి తిరిగి వచ్చేస్తాను’ అని తల్లికి ధైర్యం చెప్పాడు. ‘..ఏదైనా జరిగితే తిరిగి రాకపోనూవచ్చు’ అని భారంగా మనసులోనే అనుకుంటూ.. అడుగు ముందుకు వేశాడు. ముంబైలోని రాజ్వాడీ దవాఖానలో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించడానికి వెళ్తున్న వైద్యుడు అతను. తల్లి ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నది. 

ఆ రోజువెళ్లిన కరణ్‌, సరిగ్గా 121 రోజుల తర్వాతే మళ్లీ తల్లి దేవయానిని కలిశాడు. సుదీర్ఘ సేవల తర్వాత తనకు సెలవులు లభించాయి. అన్నిరోజులూ కరణ్‌ రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటివైపు వచ్చేవాడు. ఆమె రెండో అంతస్తు మీది నుంచి పలకరించేది. అట్నుంచి అటే వెళ్లిపోయేవాడు.‘తొలుత ఎంతో భయపడ్డాను..కానీ కొవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడే కొడుకును కన్నందుకు ధైర్యంగా ఉంది’ అంటున్నారు దేవయాని.  


logo