శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 27, 2020 , 23:45:12

ఓ చెల్లి రాఖీ సందేశం

ఓ చెల్లి రాఖీ సందేశం

కరోనా పాజిటివ్‌గా తేలిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు చాలామంది. కానీ, దేశంలో రికవరీ రేటు కాసింత ధైర్యాన్ని ఇస్తున్నది. కుటుంబంలో ఎవరైనా ఆసుపత్రి పాలైతే.. గుండెనిండా దుఃఖం. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారో అన్న ఆందోళన.  కోలుకొని ఇంటికి వస్తే కుటుంబ సభ్యుల్లో పండగే. ఆత్మీయుల ప్రాణాలు నిలబెట్టిన వైద్యుల పట్ల కృతజ్ఞతాభావం. అలాంటి, ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల’కు తానో చెల్లి అయింది.. ఢిల్లీకి చెందిన శాంతి శంకర్‌. రాఖీ పౌర్ణమి వస్తున్న క్రమంలో సోదరీసోదరులు తప్పక కలుసుకొంటారు. కానీ ఫ్రంట్‌లైన్‌లో పని చేస్తున్న వారికి ఆ అవకాశం లేదు. అందుకే పోలీస్‌స్టేషన్లకు, దవాఖానలకు రాఖీలు పంపుతున్నది శాంతి. logo