శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 27, 2020 , 23:44:59

ఆ పతకం కరోనా వారియర్స్‌కు

ఆ పతకం కరోనా వారియర్స్‌కు

భారత అథ్లెట్‌ హిమదాస్‌ తమకు వచ్చిన గోల్డ్‌ మెడల్‌ను కరోనా వారియర్స్‌కు అంకితమిచ్చింది. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులను  గౌరవించాలని చెబుతున్నది. ప్రజలతోపాటు కరోనా వారియర్స్‌ను కూడా ఆరోగ్యంగా ఉండమని కోరుతున్నది. గతంలో, ఏషియన్‌ గేమ్స్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ల బృందం వెండి పతకాన్ని సాధించింది. అదే ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన బహ్రెయిన్‌ జట్టులో ఒక అథ్లెట్‌పై డోపింగ్‌ కారణంగా నిషేధాన్ని అమలు చేయడంతో.. బహ్రెయిన్‌ అనర్హతకు గురైంది. దీంతో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ కేటాయించారు. ఆ పతకాన్ని కరోనా వారియర్స్‌కు అంకితమిచ్చింది హిమదాస్‌.logo