శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 23:19:46

అమ్మ.. ప్రేమ.. విమానం!

అమ్మ.. ప్రేమ.. విమానం!

ఇజ్రాయెల్‌.. జనవరి మాసం. అప్పటికి అక్కడ వైరస్‌ భయం లేదు. జనాలు హాయిగా వారాంతపు సెలవులను ఆస్వాదిస్తున్నారు. అలోన్‌.. తన మూడేండ్ల పాప మెలెనియాను ఉక్రెయిన్‌లోని పుట్టింటికి తీసుకెళ్లింది. తనను అక్కడే ఉంచి.. మరుసటి రోజే అలోన్‌ వెనక్కి వచ్చేసింది. అదే సమయంలో వైరస్‌వ్యాప్తిని అడ్డుకొనే ముందస్తు చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్‌ తన సరిహద్దులను మూసేసింది. విమానాలనూ ఆపేసింది. దీంతో, మెలెనియా ఉక్రెయిన్‌లోనే ఉండిపోయింది. తల్లి అలోన్‌ మాత్రం ఇజ్రాయెల్‌లో ఒంటరిగా. రోజులు గడుస్తున్నకొద్దీ నిబంధనలు కఠినతరం అయ్యాయి. తల్లి ప్రాణాలన్నీ మెలెనియా పైనే. ఈ పరిస్థితుల్లోనే దాదాపు ఏడు నెలలు గడిచాయి.  పాప అమ్మమ్మ దగ్గరే ఉండిపోయింది. తరచూ వీడియో కాల్స్‌ చేసినా అమ్మ మనసుకు తృప్తిగా అనిపించలేదు. విషయం ఓ విమానయాన సంస్థకు తెలిసింది. పాపను ఉక్రెయిన్‌ నుంచి ప్రత్యేక ఎస్కార్ట్‌తో తీసుకొని రావడానికి ముందుకు వచ్చింది. ఇటీవలే  అమ్మ ఒడిలోకి చేర్చింది. ఏడు నెలల తర్వాత బిడ్డను చూసిన తల్లి భావోద్వేగానికి గురైంది. ముద్దుల్లో ముంచెత్తింది. ఆనందబాష్పాలతో స్నానం చేయించింది. logo