శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 23:19:43

పచ్చని ఆలింగనం!

పచ్చని ఆలింగనం!

వైరస్‌ ఓ అగాథాన్ని సృష్టించింది. ఫలితంగా భౌతికదూరం పెరిగింది. ఆత్మీయ ఆలింగనాలూ, కరచాలనాలూ బంద్‌ అయ్యాయి. ఈ క్రమంలో మనుషుల్లో మానసికమైన శూన్యం ఏర్పడుతున్నది. ఆ వెలితితో ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉందని నిపుణులు  చెబుతున్నారు. ఇందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఓ వినూత్న పరిష్కారాన్ని సూచించింది. ‘ట్రీ హగ్‌' గురించి భారీగా ప్రచారం చేస్తున్నది. మనుషులకు ప్రత్యామ్నాయంగా చెట్లను ఆలింగనం చేసుకుంటే కాసింత ఉపశమనం కలుగుతుందని సలహా ఇస్తున్నది.


logo