బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Jul 26, 2020 , 02:29:11

గాడిదా.. గాడిదా.. మాస్కు ఎందుకు పెట్టుకోలేదు?

గాడిదా.. గాడిదా..  మాస్కు ఎందుకు పెట్టుకోలేదు?

ఓ జర్నలిస్టు మైక్‌ పట్టుకొని రోడ్డు మీదకు వచ్చాడు. రోడ్డు మీద ఓ గాడిద ఉన్నది. దాని దగ్గరికి వెళ్లాడు. ‘నువ్వు రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు? కరోనా వస్తుంది కదా.. మాస్కు ఎందుకు పెట్టుకోలేదు?’ అంటూ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూను చూస్తూ కొంత మంది అక్కడే ఆగారు. గాడిదతో ఇంటర్వ్యూ ముగించిన రిపోర్టరు తర్వాత అక్కడ ఉన్న మనుషుల దగ్గరకు వచ్చాడు. మాస్కులు పెట్టుకోకుండా ఉన్న ఒక్కొక్కరిని ‘ఆ గాడిద మాస్కు ఎందుకు పెట్టుకోలేదంటారు? కరోనా వస్తుందని దానికి తెలియదంటారా? గాడిదలు మాస్కులు పెట్టుకోవా?’ అని ప్రశ్నిస్తూ పోయాడు. 

కొంత మంది ‘అది జంతువు కదా అందుకే మాస్కు పెట్టుకోలేదు’ అని జవాబిచ్చారు. దానికి ఆ జర్నలిస్టు ‘అంటే కరోనా వస్తుందని తెలిసినా జంతువులు మాస్కులు ధరించకుండా బయట తిరుగుతాయా?’ అని మరింత వ్యంగ్యంగా ప్రశ్నించాడు. అసలు విషయం అర్థమైన కొందరు ఇంటర్వ్యూ నుంచి తప్పించుకోజూశారు. మాస్కు ప్రాధాన్యాన్ని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోనివారికి బుద్ధి వచ్చేలా చేయడం కోసం ఆ జర్నలిస్టు చేసిన ప్రయత్నం అభినందనీయం కదా. ఈ ఇంటర్వ్యూ బీహార్‌లో జరిగింది.


logo