గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Jul 26, 2020 , 02:29:07

చిన్నా..పెద్దా.. ఆడిపాడంగా

చిన్నా..పెద్దా.. ఆడిపాడంగా

తెలంగాణ విభిన్న సంస్కృతీ సంప్రదాయలకు నెలవు. ప్రతి మాసం, పండుగ.. దేనికదే విలక్షణం. శ్రావణ మాసం ఆరంభంలో నాగుల పంచమి రోజు లంబాడా, మథుర తెగల కుటుంబాలు ‘హింజోలో బులాయి’ ఊయలలను కట్టి ఊగుతారు. పల్లె జానపదాలు, లంబాడా మాండలికంలో పాటలను పాడుకుంటూ కష్టాలను,కన్నీళ్లను మరిచిపోతారు. అందుకే రెక్కాడితేగానీ డొక్కాడని వారైనా, ధనికులైనా ఈ ఊయలూగుతుంటే వారి కళ్లలో కోటి కాంతులు గోచరిస్తాయి. బోథ్‌ మండలం సాకెర గ్రామంలో నాగుల పంచమి రోజున శనివారం కనిపించిన జీవనచిత్రమిది. పాత ఉట్నూర్‌లో ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ సతీమణి కవిత కూడా పాల్గొన్నారు.ఈ ఊయల పండుగ  రాఖీ పౌర్ణిమ దాకా కొనసాగుతుంది.

-ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌logo