గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Jul 26, 2020 , 02:29:23

కరోనా రానివ్వని భాభీజీ అప్పడాలు!

కరోనా రానివ్వని భాభీజీ అప్పడాలు!

కరోనా బారిన పడకుండా ఉండాలంటే కషాయం తాగండి. బలవర్ధకమైన ఆహారం తినండి అని ఎంతో మంది చెప్పగా విన్నాం. కానీ ఓ కేంద్ర మంత్రి మాత్రం అప్పడాలు తినండని సలహా ఇస్తున్నారు. ‘భాభీజీ’ బ్రాండ్‌ అప్పడాలు తింటే కరోనా మీ దరి చేరదని భరోసా ఇస్తున్నారు. అప్పడాల్లో వాడిన మసాలాలు, దినుసులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ బాబీజీ అప్పడాల బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తూ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అప్పడాలను ఆత్మనిర్భర్‌ పథకం కింద తయారు చేశారని చెప్పారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనాపై అబద్ధపు ప్రచారం చేయవద్దని కేంద్రం చెప్తుంటే సాక్షాత్తూ మంత్రే ఇలాంటి వ్యాఖ్య లు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


logo