శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Jul 25, 2020 , 23:34:24

ఆకలి తీరుస్తున్నందుకు అవార్డు!

ఆకలి తీరుస్తున్నందుకు అవార్డు!

రైస్‌బకెట్‌ చాలెంజ్‌ సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపింది. సెలబ్రిటీలను ఇంట్లో నుంచి కదిలించిన చాలెంజ్‌ ఇది. ఒక్క పూట కూడా తిండి లేనివాళ్లకు బుక్కెడు అన్నం పెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన మంజులత కళానిధి ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. మంజులత సేవల్ని గుర్తించిన ఇంగ్లండ్‌ రాణి 149వ కామన్వెల్త్‌ పాయింట్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డుతో గౌరవించారు. బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఈ అవార్డును మంజులతకు అందజేశారు. సోషల్‌ మీడియా వేదికగా మంజులత రైస్‌బకెట్‌ చాలెంజ్‌ ద్వారా ఆకలితో అలమటిస్తున్న ఒకరికి ఓ బకెట్‌ బియ్యం అందించడంతో పాటు, మరో ముగ్గురిని అదే పని చేయమని కోరుతారు. 2014లో  ఈ సవాలును ప్రారంభించిన మంజులత ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవల కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో రోజువారీ కూలీలకు ఈ చాలెంజ్‌ ద్వారా ఎంతో సహాయం అందజేశారు. ఇప్పటివరకు 27వేల కిలోల నిత్యావసరాలను సేకరించడంతోపాటు నాలుగు  లక్షలమందికి పైగా ఆకలిని తీర్చగలిగారు. 


logo