గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Jul 26, 2020 , 00:12:28

రంగులు కలుపుదాం రండి!

రంగులు కలుపుదాం రండి!

సహజ రంగులు ఏమిటో తెలుసా? ‘సియాన్‌ (సీ బ్లూ), మెజెంటా (గులాబీ), ఎల్లో (పసుపు), బ్లాక్‌ (నలుపు).  వీటినే సీఎంవైకే రంగులు అంటాం. దిన పత్రికల కింది భాగంలో  నాలుగు రంగు డబ్బాలు ఉంటాయి కదా..అవే  ఈ రంగులు.  ఈ నాలుగు రంగులను కలపడం ద్వారానే మనకు కనిపిస్తున్న అన్ని రంగులూ వస్తాయి. వీటి నుంచే దాదాపు 63 లక్షల వర్ణాలను  సృష్టించవచ్చని అంచనా. ఉదాహరణకు ‘ఎరుపు’ రంగు ఉంది అనుకుందాం. ‘పసుపు, గులాబీ’ రంగులను కలిపితే సరిపోద్ది. ఆకుపచ్చరంగు రావాలంటే ‘సియాన్‌+ మెజెంటా కలపాలి.

ఇప్పుడు ఈ సహజ రంగుల సాయంతో మిగతా రంగులు ఎలా సృష్టించాలో చూడండి. మీదగ్గర ఉన్న స్కెచ్‌పెన్నులతో  ప్రయత్నించండి.

ఆకుపచ్చ 100% సియాన్‌+ 100% ఎల్లో

వయెలెట్‌ (వంకాయ రంగు)60% సియాన్‌+ 100% మెజెంటా

బ్లూ ( 100% సియాన్‌ + 100%  మెజెంటా)

ఎరుపు (100% మెజెంటా+100%  ఎల్లో)

ఆరెంజ్‌  50%   మెజెంటా + 100% ఎల్లో

ఆలివ్‌ గ్రీన్‌ 40%  సియాన్‌+ 30% మెజెంటా+ 100% ఎల్లో

ఈ ఉదాహరణలతో మీరు కొన్ని రంగులు ప్రయత్నించండి. మరికొన్ని రంగులను సొంతంగా తయారు చేయండి. 


logo