ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Jul 25, 2020 , 00:11:59

హోమ్‌ టెక్‌

హోమ్‌ టెక్‌

కరోనా కాలంలో   తినేదీ తాగేదీ ... ఏదైనా సరే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయాలనుకొంటాం.  ఆ ప్రయత్నంలో ఉపకరించేవే ఈ గ్యాడ్జెట్స్‌.

 కలియ తిప్పడానికి.. 

బేకింగ్‌ చేసేటప్పుడు అన్నీ సరిగ్గా కలిస్తేనే కేక్‌ బాగా వస్తుంది. కానీ కలియబెట్టడం పెద్ద ప్రహసనమే. చేతులు నొప్పెడతాయి. ఆ శ్రమంతా లేకుండా.. టైమ్‌ సెట్‌ చేస్తే చాలు. ఇదే కలియ తిప్పితూ ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీని పేరు..Automatic-Pan-Stirrer-With-Timer. 

ఒక కప్పు మాత్రమే

వర్షాకాలం. పైగా కరోనా కాలం. ఈ సమయంలో వేడి నీళ్లు మాత్రమే తాగాలని  డాక్టర్లు  హెచ్చరిస్తున్నారు. అయితే మనం ఒక కప్పు నీళ్లు తాగాలనుకుంటే పెద్ద కెటిల్‌లో పోసి వేడి చేస్తాం. అందులో, కావాల్సినన్నే  తాగుతాం. మిగిలిన నీళ్లు వృథా అయిపోతాయి. అలా కాకుండా, ఒక కప్పు నీళ్లను మాత్రమే వేడి చేసేలా  కొత్త పరికరం వచ్చేసింది. దీంతో కమ్మని కాఫీ, టీల కోసం కూడా నీళ్లను వేడి చేసుకోవచ్చు. ఇండక్షన్‌ ప్లేట్‌ మీద మగ్‌ పెట్టాలి. దీంట్లో ఒక రాడ్‌లాంటిది ఉంటుంది. దాన్ని ఉంచాలి. ఎలక్ట్రోమాగ్నటిక్స్‌ వల్ల రాడ్‌ వేడెక్కి, నీళ్లు లేదా ఏదైనా ద్రావకం వెంటనే వేడవుతుంది. ఈ గ్యాడ్జెట్‌ పేరు మీట్టు (Miito). దీనివల్ల పవర్‌ సేవ్‌ అవుతుంది. మరొక మంచి ఆప్షన్‌ కూడా ఉంది. నీళ్లు మరీ ఎక్కువ వేడి కాకుండా, స్టాండర్డ్‌ మోడ్‌లో పెడితే.. దానికదే ఆఫ్‌ అయిపోతుంది. ఆన్‌ చేసి మరచిపోయినా ఫర్వాలేదన్నమాట. 

చాలా రెసిపీలు..

కొన్నిసార్లు.. ఇంట్లో అన్ని కూరగాయలూ ఉంటాయి. కానీ, ఏం వండాలో అర్థం కాదు. కొన్నిసార్లు.. అనేక రెసిపీలు దొరికినా దేన్ని ఎంచుకోవాలో అర్థం కాదు. ఈ రెండు పరిస్థితుల్లో కూడా ‘డ్రాప్‌ స్కేల్‌' (Drop Scale) ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఒక యాప్‌ ఉంటుంది. ఇది డ్రాప్‌ స్కేల్‌తో అనుసంధానమై ఉంటుంది. దీనిమీద కూరగాయలు, మాంసాహారం ఏదైనా పెట్టేయవచ్చు. వాటితో ఏం చేసుకోవచ్చో యాప్‌ మనకు సజెషన్స్‌ ఇస్తుంది. వైర్‌లెస్‌ టెక్నాలజీతో దీన్ని శుభ్రం చేయడం కూడా సులువే. 


logo