నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులు 95, ఇతరులు 33 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 305 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ యన్.బాలాజీ తెలిపారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.