గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Jul 25, 2020 , 00:11:40

పోలీసులకు సలాం.. -రకుల్‌ప్రీత్‌ సింగ్‌

పోలీసులకు సలాం.. -రకుల్‌ప్రీత్‌ సింగ్‌

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. హైదరాబాద్‌ పరిధిలో కరోనా బారిన పడిన పోలీసు సిబ్బంది ఈమధ్యే తిరిగి విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో కరోనాను జయించిన 390 మంది పోలీసులను అభినందిస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె. ‘మనమంతా ఇంట్లో ఉన్న సమయంలో హైదరాబాద్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ 24 గంటలూ పని చేసింది. ఈ కారణంగా వారిలో ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 390 మంది పోలీసు ఆఫీసర్లు కరోనాను జయించి, తిరిగి విధులకు హాజరు అవుతున్న సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. మా అందరినీ ఇంకా జాగ్రత్తగా చూసుకునే శక్తి వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ హృదయ పూర్వకంగా తెలిపారు రకుల్‌. logo