బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Jul 24, 2020 , 00:06:33

పిచ్చుక కోసం చీకటిలోనే..

పిచ్చుక కోసం చీకటిలోనే..

ఆధునిక ప్రపంచంలో రోజుకో పక్షిజాతి అంతరించిపోతున్నది. మాయమైపోతున్న ఆ పక్షులను  కాపాడుకునే ప్రయత్నంలో అంధకారంలోనే కాలం గడుపుతున్నారు ఆ గ్రామస్తులు. తమిళనాడులోని శివగంగై జిల్లా మరవమంగళం సమీపంలో పోతకుడి అనే పల్లె ఉంది. ఆ గ్రామవాసులు గత ముప్పై రోజులుగా వీధి దీపాలను వెలిగించడమే మానేశారు. గ్రామంలోని ఓ విద్యుత్‌ స్తంభంపై వీధి దీపాల స్విచ్‌ బోర్డు బాక్సు ఉంది. దానిపై ఓ పక్షి గూడు కట్టుకుంది. గూడును తొలగిస్తే కానీ స్విచ్‌ ఆన్‌ చేయలేరు. కానీ ఆ గ్రామ యువకులు.. గూడు చెదిరిపోతే, పక్షి ఎగిరిపోతుందన్న భయంతో లైన్‌మాన్‌ను అడ్డుకున్నారు. మిగిలినవాళ్లూ వారికి మద్దతు తెలిపారు. పిచ్చుక జాతిని కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న చొరవపట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


logo