శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Zindagi - Jul 21, 2020 , 23:41:38

అది జ్వరం కానే కాదు

అది జ్వరం కానే కాదు

శరీరం ఇంత ఉష్ణోగ్రతను దాటితే జ్వరం ఉందని చెప్పిందెవరు? దీనికి 150 ఏండ్ల కథే ఉంది.

  • అప్పట్లో కార్ల్‌ వండర్‌లిచ్‌ అనే జర్మన్‌ వైద్యుడు, ఒక ఆరోగ్యవంతుడి శరీరంలో 98.6 డిగ్రీల వేడి ఉంటుందని నిర్ధరించాడు. అది 100.4 డిగ్రీలు దాటితే జ్వరమే అని హెచ్చరించాడు.
  • అయితే. అప్పట్లో వాడిన థర్మామీటర్లు కాస్త ఎక్కువ వేడిని చూపించేవి.
  • పారిశ్రామికీకరణ తర్వాత మనిషిలో శారీరక శ్రమ తగ్గిపోయి, శరీరం కాస్త చల్లబడిందట.
  • ఈ మార్పులన్నీ పరిగణనలోకి తీసుకున్నాక, కొత్త మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి.
  • ప్రస్తుతం 97.77 డిగ్రీలను సాధారణ శరీర ఉష్ణోగ్రతగా, 99.5 డిగ్రీలు దాటితే దాన్ని జ్వరంగా పరిగణించాలని చెబుతున్నారు.


logo